Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎలా ఉండగలను... నీ ప్రేమ లేకుండా
ఎలా ఉండగలను... నీ శాంతి లేకుండా
ఎలా నడువగలను..ఎలా బ్రతుకగలను..
నీతోడు నీడ లేకుండా నీ ప్రేమ...
వర్ణించ లేనిది- నీ ప్రేమ...
వివరించ లేనిది... నీ ప్రేమ...
మరచి పోలేనిది - నీ ప్రేమ...
విడిచి పోలేనిది...
1. శాశ్వత ప్రేమతో ప్రేమించావు - కునకక కాపాడి రక్షించావు ||2||
విడువక ఎడబాయక తోడున్నావు- సర్వకాలం నాతోవున్నావు llనీప్రేమll
2. శ్రమలలో నన్ను వీడిపోలేదు - దుఃఖములో నన్ను ఓదార్చావు ||2||
మేలులతో నన్ను తృప్తిపరిచావు - నిత్యము నన్ను నడిపించావు llనీుll
3. పాపిని నన్ను ప్రేమించావు - నాకొరకు నీ ప్రాణమిచ్చావు ||2||
రక్తము చిందించి, విమోచించావు - నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు