Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎన్ని తలచినా - ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా
జరిగేది నీ చిత్తమే - నీ వాక్కుకై
వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా-నా ప్రార్థన ఆలకించుమా ||ఎ||
1. నీతోడు లేక నీ ప్రేమలేక
ఇలలోన - ఏ ప్రాణి నిలువలేదు
అడవి పూవులే -నీ ప్రేమ పొందగ
నా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా - నా ప్రార్థన ఆలకించుమా ||ఎ||
2. నా యింటి దీపం -నీవే అని తెలిసి
నా హృదయం -నీ కొరకే పదిలపరచితి
ఆరిపోయినా - నా వెలుగు దీపమూ
వెలిగించుము - నీ ప్రేమతో ప్రభువా
వెలిగించుము - నీ ప్రేమతో ||ఎ||
3. అపదలు నన్ను - వెన్నంటియున్న
నా కాపరి -నీవై నన్నాదుకొంటివి
లోకమంతయూ - నన్ను విడచినా
నీ నుండి వేరుచేయవూ ప్రభువా
నీ నుండి వేరుచేయవూ ||ఎ||
4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి -
నాకొరకై కల్వరిలో యాగమైతివి
నీదు యాగమె నా మోక్ష భాగ్యము -
నీ యందె నిత్య జీవము (ప్రభువా) ||ఎ||