Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంతో సుందరుడమ్మ తాను -
నేనెంతో మురిసిపోయినాను
1. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు
అవని పది వేలందు అతిశ్రేష్టుడాతండు
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు
అవలీలగానతని గుర్తింపగలనమ్మ
2. కురులు నొక్కులు గల్లు స్పురద్రూపియగు విభుడు
మరులు మనసున నిలుపు మహానీయుడాతండు
సిరులు కురిపించేను పరలోక తనయుండు-
విరబూయ పరలోక షారోను విరజాజి
3. పాలతో కడిగిన నయనాలు గలవాడు-
విలువగు రతనాలవలె పొదిగినా కనులు
కలుషము కడిగిన కమలాల కనుదోయి-
విలువైన చూపొసగె వరమేరి తనయుండు
4. అతని చెక్కిళ్ళు పరిమళము లెగసేను-
గంధవర్గముల చేత శోభిల్లు భాగాలు
అతని పెదవులు మృధువైన పద్మాలు-
అతిమధుర పదజాల మందుండి అలరారు
5. ఆతని కరములు రత్న భూషితములై యుండు -
అతని కాయము నీల రతనాల ఖచిత
అతి చిత్రమగు దంత పనిగాను కనుపించు-
ఆతడెంతో సుందరుడు అతి ప్రేమ పాత్రుండు
6. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన-
చలువరాతిని బోలుబలమైన పాదాలు
ఆ లెబనోను సమరూపవైఖరి-
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు
7. అతడు అతి కాంక్షనీయుండు రాయుండు-
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
అతని నోరతిమధురంబు మధురంబు -
అతని పలువరస పగడాల సరివరుస