Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా ||2||
ఇంతగ నన్ను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు ||2|| ||ఎంత||
1. ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించుదేవుడునీవే
అల్పుండను మట్టి పురుగును .
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వము
నా కొరకై అర్పించావు
2. నిన్ను వెంబడించు వారిని
నిజముగ సేవించు వారిని
నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని
ఎంతో ఘన పరచెదవు ఆశీర్వదించెదవు
శత్రువులకంటే ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు
3, వినయము గల మనుష్యులను
వర్థిల్ల చేసెదవు
గర్విష్ణుల గర్వమునణచి
గద్దెనుండి దించెదవు
మాదు ఆశ్రయదుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా మోదమా
మా కున్నదంతయు నీ దానమే