Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎంతటి ప్రేమ నీదీ యేసయ్య
ఎల్లలులేని ప్రేమ నీదీ యేసయ్య ||2||
ఇంతగ మమ్ము ప్రేమించితివి
ఈ స్థితిలో మమ్ము దీవించితివి
యేసయ్య మా యేసయ్య
మేము మరువము నీప్రేమను
1, సంపదలో గొప్పదనమును
సమకూర్చే దేవుడ
నీవే హెచ్చించువాడవు నువ్వు మమ్ము
తగ్గించువాడవు నీవే ||2||
అల్పులము గర్వాత్ములము
మమ్ము ప్రేమించావు ||2||
యేసయ్య మాయేసయ్య
మేము మరువము నీ ప్రేమను
2. నిన్ను అనుసరించువారిని
నిజముగా సేవించువారిని
నీవుండే తావులలో నిలిచిన నీ
నిజ భక్తులను ||2||
ఎంతో ఘనపరుచుదవు
ఆశీర్వదించుదువు ||2||
యేసయ్య మాయేసయ్య
మేము మరువము నీ ప్రేమను