Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఏమి అర్పింతును దేవా
నా స్వరము నీవొసగిన వరములేగా
కన్న తల్లి నిన్ను మరచిన
నేను మరువనని పలికిన తండ్రి
నీకు నేను ఏమి అర్పింతు దేవా
నా సర్వము నీవొసగిన వరము లేగా
1. ఆబేలుని అర్పణకన్న
మేలయినది అర్పించగలనా
అబ్రాహాముని బలికన్న
మేలయినది నేనివ్వగలనా
నా చిన్న హృదయాన్ని అర్పించెద దేవా ||2||
ఈ అప్ప ద్రాక్ష రసములతో 'కలిపి
నా చిన్ని హృదయాన్ని అర్పించెద దేవా ||2||
దేవా చేకొనవా ఈ ప్రేమ విందునే ||ఏ||
2. ఈ లోక ధనము ధాన్యము కంటే
విలువైనది నా ఈ జీవితం
నీ కొలువే ఒక నందనమై ||2||
విరబూసెను ఇది నీ సేవకై
ఈ దీన కరములతో అర్చించగ దేవా
నీ ప్రేమ వరమైన నా జీవితంలో
దేవా దీవించ నీ కొరకే జీవింపగ ||ఏ||