Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎన్నినాళ్లగమనమో
ఎంత దూరపయనమో
ఈ ధరిత్రిలోననీ
బ్రతుకు దినములెన్నియో
1. గడ్డి పువ్వు వంటిది
భూనివాస జీవితము
ఇంతలోన విరియునో
అంతలోన వాడునో ||ఎ||
2. నీటి మీద తేలినా
బుడగవంటి జీవితం
ఎప్పుడు పగిలిపోవునో
ఏ నరునకు తెలియదు ||ఎ||
3. త్రాసుమీద ధూళిలా
ఎగిరిపోయె జీవితం
కలలు కన్న జీవితం
కలసిపోయెనేలలో ||ఎ||
4. చేదనుండి జారెడు
నీటి బిందు బ్రతుకాయె
జారుచున్న బిందువు
ఎవరి తరము నిలుపగన్ ||ఎ||
5. యేసే సత్యమార్గము
యేసునిత్య జీవము
యేసే మోక్ష మార్గము
ఇదియే నమ్ము నిక్కము ||ఎ||
6. నీటిమీద తేలిన
బుడగవంటి జీవితం
ఎపుడు పగిలిపోవునో
దేవా నీకే తెలియును ||ఎ||