Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా
కనుమూసె కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా
1. నీకు మేడ మిద్దెలున్నా ప్రభుని చూడలేవు
మోకాళ్ళు వంచి నువ్వు మొర పెట్టి ప్రభునడిగి చూడుమన్నా
2. నీకు ధనము బలము ఉన్న నీవు ప్రభుని చేరలేవు
ఆ ధనము కాస్త మరి కరిగిపోతే దరికెవ్వరు రారు సుమ
3. నువ్వు పాపి రోగివయ్యా ప్రభు పిలుచుచున్నాడయ్యా
ఆ ప్రభుని చూసి నీ మనస్సు మార్చి ప్రభునడిగి చూడుమన్నా