Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా. ఎంత మధురం భక్తి బంధురం
ఏసు దేవా మీ పుణ్య చరితం
ప. నీవు పలికిన ప్రతివచనం
అనంత ప్రేమకు నిర్వచనం ||2||
నీవు అందించిన ప్రతి ఉపమానం
మా ముక్తికే సోపానం ||2||
1. మానవ జాతిని తరింప చేసిన
శాంతి సూత్రం నీ సందేశం
శాంతి శాంతి శాంతి ||2||
చీకటి ముసిరిన బ్రతుకు బాటలో
ప్రేమ ఉషస్సులు కురిపించి ||2||
ప్రేమ ఉషస్సులు కురిపించెను
2. పగతో రగిలే కలుషాత్ములకు
ప్రేమ మంత్రం నీ ఉపదేశం ||2||
ఉత్తమ గతులను చిత్తము నిలిపినా
సుమధుర నాదం నీ శుభవేదం ||2||
సుమధుర నామం నీ శుభవేదం