Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎంత మధురమో యేసుని ప్రేమా
ఎంత మధురమో నా యేసుని ప్రేమా
ప్రేమా...ప్రేమా...ప్రేమా... ప్రేమా...
1. అంధకార బంధము నన్నావరించగ
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2||
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను||ఎంత||
2. రక్షించువారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురిపెట్టి యుండగా
బంధము తెంచేను బ్రతికించెను నన్ను
నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత||
3. ఎన్నో పాపములు చేసి మూటకడితిని
ఎన్నో మోసములు చేసి దోషినైతిని ||2||
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత||
4. కుష్ఠిరోగినై నేను కృంగియుండగా
భ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత||