Type Here to Get Search Results !

ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ( enno kalathalu brathuku dhariloo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా 

నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప

యేసు ప్రభో విశ్వవిభో ఇక నాకు భయమేల నాచెంత నీవుండ


1. సిరులెన్ని నావెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే

నీవు లేకుంటే నాకు బ్రతుకే నీశిరాతిరి

కంట నీరు కారేను మనసు మూగ పోయేను

దారి నాకు మరుగాయె తోడులేక నేనున్నా

నీవే నాకు బాసటగా నీ వరములు నాపై కురిపించు

ఇక ఆటుపోట్లు నను తాకినపుడు గెలిచేది నేనే దేవా


2. నేను నీ పక్షమున్నా శోధన నను చేరదూ -

నీవు నను తాకగానే తనువే పులకించెను

దేవా నన్ను కరుణించు నీదు బాట చూపించు

హృదయ వీణ శృతిచేసి మధుర జతులు పలికించు

నీవే నాకు ఆధారం - నా మనసుకు నీవే ప్రాకారం

నా ఆర్తి తీర్చి కన్నీళ్ళు తుడిచి నీ స్వర్గధామము చేర్చు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section