Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ..... ఆ..... ఆ......
ఎవరి కోసమో - ఈ ప్రాణ త్యాగము ||2||
నీ కోసమే .... నా కోసమే .......
కలువరి పయనము - ఈ కలువరి పయనం ||2||
1 వ చరణం..
ఏ పాపం మెరుగని నీకు - ఈ పాపలోకమె సిలువ వేసిందా
ఏ నేరము తెలియనినీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా
మోయలేని మ్రానుతో - మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో - తడబడుతు పోయావా ...
సోలి ...... వాలి ..... పోయా...వా.....llఎవరిll
2 వ చరణం..
జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
ఆ... జీవజలమును మాకు ఇచ్చావు - చేదు చిరకును నీకు ఇచ్చాము
ఆ... మా పక్కన ఉండి - మమ్ము కాపాడుచుండగ
నీ ప్రక్కన బల్లెముతో - ఒక్కపోటు పొడిచితినిllఎవరిll
తండ్రి వీరు చేయునది వీరు ఎరుగరు
వీరిని క్షమించుము - వీరిని క్షమించుము
అని వేడుకున్నావా .... పరమ తండ్రిllఎవరిll