Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా...
ప: మహోన్నతమున పరమ దేవునికి మహిమ
భూలోక ప్రజలకు శాంతి సమాధానము
గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా తండ్రి
సర్వశక్తిగల దేవా పితయైన మా ప్రభువా||2||
మిమ్ము ఘనపరిచేదం
మిమ్ము స్తుతియించెదం
మిమ్ము పొగడెదము
మిమ్ము ఆరాధించెదం ||గ్లోరియా|| ||6||
2. జనితైక సుతుడా
ఓ యేసా ఈలోక రక్షకుడా
లోక పాప పరిహారకుడ
దేవుని గొఱ్ఱపిల్లా ||2||
మిమ్ము ఘనపరిచేదం
మిమ్ము స్తుతియించెదం
మిమ్ము పొగడెదము
మిమ్ము ఆరాధించెదం ||గ్లోరియా|| ||6||
3. మీరొకరే పరిశుదులు ఓ మహోన్నతుడా
పిత దేవ సుతుడా పవిత్రాత్మ సర్వేశ్వరా ||2||
మిమ్ము ఘనపరిచేదం
మిమ్ము స్తుతియించేదం
మిమ్ము పొగడెదము
మిమ్ము ఆరాధించెదం ||గ్లోరియా|| ||6||