Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గొల్గొత శిఖరాన 2
సిల్వలోబలియైన యేసయ్యా
నా కొరకై మరణించిన యేసయ్యా
నా పాపభారాన్నిమోసేందుకే
నా జీవితాన్నిమార్చేందుకే సిల్వలో
1 వ చరణం..
భయంకర పాపినైన నన్నునీ రక్తముతో కడిగితివి
నా పాపభారాన్ని మోసితివే
నా పాపజీవితమును మార్చితివే
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ కల్వరిప్రేమను చూపించితివే
2 వ చరణం..
వధకు తేబడిన గొర్రెపిల్లవోలె
మౌనిగ చిత్రహింస నొందితివే
నా తలపులకై ఆ ముండ్లమకుటము
నా క్రియలకై ఆ మేకులన్
భరియించి భారము మోసితివే
తరియించి నీదరికి చేర్చితివే