Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గొప్ప మనస్సు యేసయ్యా నీకుంది
ప్రతిక్షణం స్తుతించెదను నిన్ను నేను
ప్రతిక్షణం స్తుతించెదను
ఘోరపాపిని పురుగు వంటివాడిని
బిడ్డా అని పిలుస్తున్నావా ఈ పాపిని కౌగిలించుకుంటావా ||గొప్ప||
1. వయస్సులో పెద్ద వాడనైనను,
చిన్న బిడ్డవలె ప్రవర్తిస్తున్నాను
నీకు ద్రోహమయిన పనులను చేసిననూ
నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా ||గొప్ప||