Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. గొఱ్ఱలగొప్ప కాపరి నాయేసు
మందకొరకు ప్రాణం పెట్టిన నా యేసు
మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నా జీవకాపరి
1. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు
దారితప్పిన నన్ను రక్షించుటకొరకు
కొండలు కోనలు దాటావు ,
లోయలో లోతులలో వెదికాడు
2. జీవాహారముగా తన శరీరమిచ్చాడు
పాపపరిహారముగా తనరకమునిచ్చాడు
పచ్చిక బయళ్ళలలో మేపాడు
శాంతిజలాల్లో నడిపాడు
3. ఎండ వేళలలోనన్ను నీడకు నడిపావు
చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు
ఎన్నడు నన్ను వీడడు
ఎప్పుడు నాతో ఉంటాడు