Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గూడులేని గువ్వలా దారి తప్పితి -
గుండె చెదరిన కోయిలనై మూగవోయితి
నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా-
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా
1. గువ్వలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం -
నాకేమో నువ్విష్టం నీ సన్నిధి యిష్టం
నువ్వంటే ఇష్టం యేసయ్యా-
నువు లేకుంటే బ్రతుకే కష్టమయా
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా -
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా
2. చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం-
నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో యిష్టం
నేనంటే నీకెంతో యిష్టమయా-
నీవెంటుంటే యింకా యిష్టమయా
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా -
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా