Type Here to Get Search Results !

గుండె చెదిరిన వాడనయ్యా ( gunde chedhirina vadanaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గుండె చెదిరిన వాడనయ్యా 

బాగుచేయుమయా - యేసయ్యా 

ఎండి మోడైన నా బ్రతుకును 

చిగురింప జేసితివయ్యా ||2|| 

నా అండ నిలిచి నా వెంట నడచి నీ 

బండ పైన నిలిపితివయ్య ||2|| ||గుండె|| 


1. ఏ దిక్కులేని నాకు, దిక్కువు నీవై

నీ అక్కున నన్ను చేర్చితివయ్యా ||2|| 

నా అక్కరలన్ని మహిమతో తీర్చిన 

చక్కని తండ్రివయ్యా యేసయ్యా 

చక్కని తండ్రివయ్యా ||చక్కని|| ||గుండె|| 


2. ఎన్నికలేని జనమె యుండగా బలమైన 


సంఘముగ మము మార్చినావు ||2|| బలవంతుడా నీ చేతిలో బాణమై 

సాతానుని ఓడించి యేసయ్యా

నీ స్తుతి చేసెద ||సాతానుని|| ||గుండె|| 


3. తీగలు సడలిన వీణనై యుండగా 

శృతి చేసి నను నీవు పలికించినావు ||2|| 

ఆత్మీయ రాగాలు పాడుతు నేను 

ఆత్మతో సత్యముతో-ఆరాధించెదను ||ఆత్మతో|| ||గుండె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section