Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. ఇది ఏమి అయ్యయ్యో - ఈ రీతిగా బాధ
హింస చెందగ వలనా... నా యేసు llఇదిll
2. పామర జనులకై భారమైన స్లీవ
భార మందున క్రుంగెనా? ...నా యేసుllఇదిll
3. శుచికారు లై నట్టి- సుందరాత్మకులు
శృంగార వనము చేరిరే ...నా యేసుllఇదిll
4. రాజాధి రాయుడు రక్షకుడగు క్రీస్తు
రక్తపు చెమట చేతను ...నా యేసుllఇదిll
5. ధర యందు కూలిన నర జన్మముల కొరకు
నా దివ్య సుతుడప్పుడు ...నా యేసుllఇదిll
6. అదరి బెదరిన మనస్కుల శరీర పురుషులు వీడియోస్
అదృశ్యలై వచ్చిరి ...నా యేసుllఇదిll
7. సర్వాంత జగమున సకల జనుల కొరకు
సరిగ స్లీవ లో ఘోర ...నా యేసుllఇదిll
8. పాటుపడవలెననుచు పరమ పిత మీకు
పాలించి యున్నారు ...నా యేసుllఇదిll
9. మీ చిత్త మని స్వామి - మిన్ను చూచి పితను
మనవి చేసినారు ...నా యేసుllఇదిll
10. ఇంతలో జో దాసు - హేరోదు బంటులకు
నెరుక చేయబోయెను ...నా యేసుllఇదిll
11. ఎరుక చేసినయట్టే ఇరువేలు బంట్రోతు
లేకమై వచ్చినారు ...నా యేసుllఇదిll
12. ఓరి గురువేడని ఒలివేతు చెట్లలో
నొదిగి దాగియుండగా ...నా యేసుllఇదిll
13. పాప కర్ముండైన పామర జూదాసు
పరుగు పారుచు వచ్చెను ...నా యేసుllఇదిll
14. గురువా శరణమని గుర్తించి ముద్దియ్య
ప్రజ గుంపులై వచ్చిరి ...నా యేసుllఇదిll
15. పట్టి కొట్టు మటంచు పామర భటులు
పైబడి దుమికిరి ...నా యేసుllఇదిll
16. పట్టి త్రాళ్లతో గట్టి తిట్టి గట్టిగ నెట్టి
కొట్టి రే కొరడాలతో ...నా యేసుllఇదిll
17. నర జన్మ ఎత్తిన నా రక్షకుడు ఏసు
నయ మార్గమును జూపిరే ...నా యేసుllఇదిll
18. కపట పూరితులైన కావర సేవక
కర్ములందరు గూడిరే ...నా యేసుllఇదిll
19. కొట్టి చర్మం - బంత రెక్క లిరుగగొట్టి
పట్టి ఈడ్చుకపోయిరే ...నా యేసుllఇదిll
20. వాడు హేరోదను వాని ఇంటికి బంపె
వరగుణ శ్రీ యేసుని ...నా యేసుllఇదిll
21. పిచ్చి వాడని తెల్ల- కప్పడమందించి
యిచ్చను దూషించి రే ...నా యేసుllఇదిll
22. ముచ్చు బర బాసు బుచ్చి స్వామిని జంప
వచ్చు ననుచు గూసిరే ...నా యేసుllఇదిll
23. పాపిష్టి పిలాతు పరగ ద్రోహుల చేత
బాధింప బంపించెనే ...నా యేసుllఇదిll
24. రాతి కంభమున కు భీతి త్రాడుల గట్టి
జాతి మెల్లల గొట్టి రే ...నా యేసుllఇదిll
25. ఘాతకులు ముండ్ల చేత కిరీటము
పాతుకొనం దట్టిరే ...నా యేసుllఇదిll
26. పరిహాస రాజుగా పావన యేసును
పాతకులు చేసిరే ...నా యేసుllఇదిll
27. భారమైన స్లీవ పావన రక్షకుని
బాహువుపై మోపి రే ...నా యేసుllఇదిll
28. మోయలేక స్లీవ మూర్ఛిల్లు ముమ్మారు
ముఖమంతటా బడి రే ...నా యేసుllఇదిll
29. హా దేవా హానాధా హా జేసువా నా
మహా పాప మిటు జేసెనా ...నా యేసుllఇదిll
30. తల్లినెదుర్కొని తల్లడ మందిరే
ఉల్లము నీరాయెను ...నా యేసుllఇదిll
31. వంటిని గాయాల నందిని వస్త్రాల
గెంటి గొబ్బున నీడ్చిరే ...నా యేసుllఇదిll
32. తంటా కోరులు స్లీవ నంట చీలలు గొట్టి
మంట నొప్పులు దార్చిరే ...నా యేసుllఇదిll
33. జంట తస్కరుల వెంట భారపు స్లీవ
మంట నాటకగ నీడ్చిరే ...నా యేసుllఇదిll
34. దేవ సుతుడివైన తీవరంబుగ నీవు
దిగుమని దూషించి రే ...నా యేసుllఇదిll
35. వేదనతో స్లీవ మీద గంటలు మూడు
బాధ రక్షకుడు పొందిరే ...నా యేసుllఇదిll
36. దాహమనగా చేదు ద్రాగనిచ్చినాదు
ద్రోహ మిట్టిదయ్యెనా ...నా యేసుllఇదిll
37. వగట మేను గంది మొగము వాడగ నేడ్చి
యగడు బొందిరె యక్కట ...నా యేసుllఇదిll
38. తమ శత్రువులకై తమ పరమపితను
దయతోడ వేడిరే స్వామి ...నా యేసుllఇదిll
39. గోడు మనుచు స్వామి ఏడుమారులు మాట
లాడి ప్రేమ జూపి రే ...నా యేసుllఇదిll
40. నేడు ముగిసెనని నాడు శిరమును వంచి
వీడి రే ప్రాణమును ...నా యేసుllఇదిll
41. నా ఘోర పాపము నశియింప చేయగ
నాథుడీ శ్రమలొందిరే ...నా యేసుllఇదిll