Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్నేహార్పణ
ప. ఇది పూజా బలిఫలము
క్రీస్తేసుని సాక్షాత్కారము ||2||
దేవుని వాక్కు సాకారం
సిలువ యాగ సమర్పణము ||2||
రండి రారండి దివ్య విందులో
పాల్గొన రారండి ||2||
1. గురువు రూపమున యేసు ప్రభువు
అనుగ్రహించే ఈ విందు
గోధుమ రొట్టె ద్రాక్షారసము ||2||
యేసు దేహము దివ్య రక్తము ||ఇది ||
2. క్రీస్తు వరములతో కూడిన విందు
మోక్షమునొందగ సహాయపడును
ఆత్మారోగ్యం దేహారోగ్యం ||2||
శాంతి సౌఖ్యము చేకొందాము ||ఇది ||
3. జీవితమందున పరిశుద్దాత్ముని
నిరతము నిలిపి జీవించెదము
సోదర ప్రేమ దేవుని ప్రేమతో ||2||
ఇలలో స్వర్గం అనుభవింతము ||2|| ||ఇది ||