Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇది పవిత్ర ప్రసాదం
ప్రభు యేసుని త్యాగం
రండి రారండి ఆరగించండి ||2||
జీవం పొంది రక్షణపొంది జీవించండి ||2||
1. నేనే మార్గం నేనే సత్యం
నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం ||2||
మృత్యుంజయుని పరమ పవిత్ర
శరీర రక్తాలు
స్వీకరించి సేదతీరి శాంతిని పొందండి ||2||
2. సిలువలో మరణించి సమాధిని గెలిచి
సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం ||2||
లోక రక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు ||2||
స్వీకరించి సేదతీరి శాంతిని పొందండి ||2||
3. అలసి సొలసిన జనులకు
కృశించుచున్నా ఆత్మలకు
శాంతి ప్రేమను ఒసగెదనన్న
ప్రభుని ప్రసాదం ||2||
ప్రేమామయుని పరమ
పవిత్ర శరీర రక్తాలు ||2||
స్వీకరించి సేదతీరి శాంతిని పొందండి||2||