Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇది పరలోక ఆహారం ప్రభు పరిశుద్ధ ఆహారం
పరమందు మనలను చేర్చే ప్రభు జీవ ఆహారం
మన ఆత్మల ఆకలి తీర్చే ప్రభు ఆత్మీయ ఆహారం
అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం
1 వ చరణం..
నా శరీరం భుజియించండి నిరతం
నాలో జీవించండి
నా రక్తము సేవించండి జీవము కలిగి బ్రతకండి
అనిపలికిన ప్రభు విందిది మన జీవవిందిదిష
నిత్యజీవమిచ్చే మన రక్షణవిందిది
రండీ లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో
2 వ చరణం..
అలసిన మనసుల అక్కున చేర్చే
సేదను తీర్చే ఆహారం
వ్యాధి బాధలను దూరం చేసే
స్వస్ధతనిచ్చే ఔషదముష
మన విశ్వాసం బలపరచి ప్రభు సాక్షులుగానిలచి
పరమందు మనలను చేర్చే మన జీవవిందిది
రండీ లోకొనుడీ పరిశుద్ధ హృదయాలతో