Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఇది నాలో పలికే సందేశం
ఇది నాలో చిలికే ప్రబోధం
అమర విందుకు - ఆనందముతో
ప్రభువు విందుకు – ఆహూతులందరు ||2||llఇదిll
1 వ చరణం..
చీకటి నిండిన - బ్రతుకులో
వెలుగు నింపే - దివ్యజ్యోతి
పాపము నిండిన – మనస్సులతో
జీవము నింపే - పరమ మూర్తి ||2|| llఇదిll
2 వ చరణం..
ఆకలి నిండిన బ్రతుకులో
భోజన విందుకు ప్రేమమూర్తి
దాహము నిండిన ఆప్తులకు
జీవము నిచ్చే జీవమూర్తి ||2|| ।ఇది।