Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: నిఖిలలోక పాలకా జగతి జీవ కారకా .
పాహిమాం ! పాహిమాం! మాం పాహిమాం
ప: జగమేలు తండ్రికి జయమంగళం
జగదేక వీరునికి శుభ మంగళం -
నిత్య జయ మంగళం
గీతముతో సంగీతముతో
నీపూజ చేయంగ నిలిచాము మేము
1. నీ ఆలయమే శాంతికి నిలయం -
నిను సేవించే జీవమే ధన్యం
నోములు పండే పూజాబలిని -
అందుకొనుమయా ఇలవేల్పు నీవై
2 భవ బంధాలే జీవిగ నిలిపే -
నవ మందిరమే ప్రాణిగ నిలిపే
సుందరమై గుణ బంధురమైనా -
పూజాబలి వరబలియై వెలయగ
3. నీ సన్నిధిలో కొలిచేటి మాకు -
పూజలు సలిపే స్థిర మనసు నొసగి
నీ జాడలో నడుపు ఈ దీన జీవిని -
వెన్నెల కురిపించు నా బ్రతుకు బాటలో