Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కలుషహరణము సిలువ బలి ఫలము
ఆదాముజనులకు పాపహరణము
సిలువ బలి ఫలము
1. యాజ్వ యాగము ప్రభువే సిలువన్
యాజ్వ యాగము ప్రభువే పూజన్
సిలువ బలిని పూజా బలిలో
నిరతము మన బలి పీఠముపై
జరుపు మార్గము యేసు వేర్పరచెన్
మన ఆత్మ పీఠములో
వసింప పూజ నేర్పరచెన్
ఆ స్వామి స్థాపిత రక్తసిక్తముగాని కల్వరిదే
2. సిలువ నాధుని కలిమి బలిమి
కల్గిన ప్రభు వాక్యము వినుడు
దైవ వాక్యము నాలకించ జీవము
ఆ జీవితేశుని - కర్ణ పేయము
గొల్పుచుండును మన అంతరంగములో
వసింప-స్వామి వేంచేయు
ఆ జీవితేశుని దైవ వాక్యము
నాలకించుదము.