Lyrics: Rev. Fr. Rayappa Pothireddy
Music/Tune: Dr. PJD Kumar
Album: సంగీతార్చన
ప: కనికరము చూపుమా కరుణ సాగరా
దయగొని మము బ్రోవుమా దీన బాంధవా
నీ మాటను మీరి నేను పాపము చేసితిని ||2||
నీ సన్నిధి యెడబాసితి
నీ ప్రేమను కోల్పోతిని ||2||
కరుణామయా కరుణించుమా
కృపచూపి కాపాడుమా ||2||
1. ఆదాము ఏవలు నీ మాట మీరిన .
క్షమాసిరులను కురిపించలేదా ||2||
దుడుకు చిన్నవాని వలె ...
తిరిగి చెంత చేరాను .. ||2||
నా మాలిన్యము కడిగి
నీ గృహముకు నడిపించు. ||2||
కరుణామయా.కరుణించుమా
కృపచూపి కాపాడుమా . ||2||
2. నీ ప్రియ ప్రజలు .
నీ దారి వీడినా నీ కృపను
కురిపించి నడిపించలేదా ||2||
ముళ్ళపొదలలో ఉన్న
చిన్ని గొఱ్ఱెపిల్లనయా ||2||
నా గాయములను కడిగి
నా వెతలను తీర్చుమయా ||2||
కరుణామయా కరుణించుమా
కృపచూపి కాపాడుమా ||2||