Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Christopher Babu
Album: పరవశింతు ప్రభువా
ప: కనికరించుమా యేసయ్యా
కరుణతో బ్రోవుమా మెస్సయ్యా
కాదని పోతిని నీ ప్రేమన్
క్షాళన చేయుమా
నా దోషములన్ నాపాపములన్ ||క||
1. తుంటరి వానిగ తిరిగితిని
ఒంటరి వానిగ మిగిలితిని ||2||
చివరికి నీదరి చేరితిని ||2||
నీ గృహమున నను చేర్చుమయా
శరణమయా ||కని||
2. నీ రూపున నను మలచితివే నీ
ఊపిరినే పోసితివే ||2||
పతితుడనైతి (ని) మృతినే చేరితి ||2||
నీకృపలో నను బ్రతికించుమయా
కరుణామయా ||క||