Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: కళ్ళల్లో కన్నీరెందుకు
గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకూ ||3||
నెమ్మది లేకున్నదా
గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ
యేసే నీ నిరీక్షణా ||2|| ||కళ్ళ||
1. హోరు గాలులు వీచగా
తుఫానులే చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా
నెమ్మది ఆయెనుగా ||2||
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షక కలత చెందకు నీవిక ||కళ్ళ||
2. కరువు ఖడ్గము లొచ్చిన
తల్లిదండ్రులు పోయిన
నింద వేదన చుట్టిన .
బంధుమిత్రులు విడిచిన ||2||
లోకమంత ఏకమైనా
భయము చెందకమయా
యేసే నీ రక్షక దిగులు చెందకు నీవిక
యేసే విమోచక సంతసించుము నీవిక ||కళ్ళ||