Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
కరుణించు ఈ దీనుని దేవా -
క్షమియించు ఈ పాపిని
నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా -
నీ సేవచేయగ వరమీయరావా
శరణం దేవా శరణం
నీ శరణు శరణు శరణం శరణం
1. అలనాటి భక్తులను దీవించలేదా -
ప్రియమైన వారిని కరుణించలేదా
నా దీన ప్రార్థనను ఆలించు దేవా -
నా జీవితాశయం నెరవేర్చుమయ్యా
2. నాలోని ఈ ప్రాణం ఉన్నంత కాలం -
నీ ఘనతనే ఇల కీర్తింతునయ్యా
బలమైన నీ హస్తం - నా చెంత నుండ -
భయమేల నాకయ్య - ఈ బ్రతుకులోన