Type Here to Get Search Results !

కనులు మూసినా కనులు తెరచినా ( kanulu musima kanulu therachina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కనులు మూసినా కనులు తెరచినా 

కనిపించేది నీ మహాత్యమే 

భూమినంతటను ఓ దేవా ||2|| 


1. చంటి బిడ్డలు పసికందులు 

నిన్ను స్తుతింతురు 

నీ మహత్యమ్ము ఆకాశము వరకును 

కీర్తింపబడుచున్నది 

విరోధుల నెదిరించుటకు 

నీవొక దుర్గమును నిర్మించితివి 

దాని నుండి నీవు నీ శత్రువులను

నీ మీద తిరుగుబాటు చేయువారిని

అణచివేయుదువు ||కనులు|| 


2. నీవు కలిగించిన ఆకాశమును నీవు సృజించిన 

చంద్రతారకలను గాంచి

నేను విస్మయమొందితిని ||కనులు|| 


3. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు

అతడేపాటివాడు 

అల్ప మానవుని పరామర్శించుటకు 

అతడెంతటివాడు 

అయినను నీవు నరుని నీ కంటెను కొంచెము 

తక్కువ వానినిగా మాత్రమే చేసితివి 

కీర్తి మహిమలను కిరీటముతో అతనిని 

అలంకరించితివి ||కనులు|| 


4. వన్యమృగములు ఆకాశమునందలి

పక్షులు సాగరమునందలి జల జంతువులు 

మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికిని 

అతనిని అధిపతిని గావించితివి ప్రభూ ||2|| 

సమస్తమును అతని పాదముల 

క్రిందనుంచితివి ||కనులు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section