Type Here to Get Search Results !

కాచుకొనియున్నాను ప్రభువా ( kachukoniyunanu prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: దప్పిక గొన్న దుప్పివలే-వేకువకై వేచియుండు 

గస్తీదారునివలె వేచియుంటిని కాచియుంటినీ 

ప్రభువా...నీ జీవపు మాటకై... 

నిత్య జీవపు ఊటకై 


ప: కాచుకొనియున్నాను ప్రభువా నీ వాక్యముకై 

(నే) కాచుకొనియున్నాను ప్రభువా నీ వాక్యముకై 

జీవజలములలో నను నడిపించే 

నీ చల్లని వాక్కుకై ||2|| 

మాట్లాడుమా దేవా నీ జీవపు పలుకులు

మాట్లాడుమా దేవా నిత్య జీవపు ఊటలు ||2|| 


1. యిర్మియా నీ వాక్కును భుజించగా

ఆ హృదయము ప్రమోదమాయెను ||2|| 

నీ వాక్కును మేము ఆలించగా 

మాలోని పాపము పోయెగా ||మాట్లాడుమా|| 


2. ఎజ్రా నీ వాక్కును పఠించగా 

ఎందరో మారుమనసు పొందిరి ||2|| 

నీ వాక్కును మేము ధ్యానించగా 

మాలోని పాపము పోయెగా 

నీ వాక్కును మేము ధ్యానించగా 

మాలోని చీకటి పోయెగా ||మాట్లాడుమా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section