కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచినట్లు
పాపి నన్ను కాయుటకు వచ్చితివా యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
1. తల్లి కడుపులో ఉండుటకు మునుపే
నీ ఆలోచనలో నేనుంటినయ్యా
నా గూర్చి నీకున్న ప్రణాళికలో
నే నిరతము జీవింతును ॥ఆరాధన॥
2 లోకము నన్ను వెలివేసిన
నన్ను ఆదరించి హత్తుకొంటివి
నీ కౌగిటిలో నా బాధలన్నీ
మరతును యేసయ్యా ॥ఆరాధన॥