పల్లవి : తండ్రి దేవా ఆరాధించెదం- యేసయ్య నిన్నే ఘనపరచెదన్
పావన ఆత్మప్రభు - నిన్నే ప్రేమించి కొనియాడెదన్ (2)
ఆరాధించెదం - ఘనపరచెదన్ నిన్నే ప్రేమించి కొనియాడెదన్ (2)
1. పుత్రునిగా ఎన్నుకొంటివి - మరుజన్మమొసగితివి
పుత్రికగా ఎన్నుకొంటివి - మరుజన్మమొసగితివి (2)
రారాజులం మేమేగా యాజకులం మేమేగా (2) ॥ తండ్రి ॥
2. సకల సృష్టికర్తవు - సర్వశక్తిమంతుడవు
మహిమకు పాత్రుడా ఆరని ప్రకాశమా (2) ॥ తండ్రి ॥
3. పరిశుద్ధ పరిశుద్ధుడా - పరలోకరాజుండా (2)
నిరతము ఉండువాడా - పునరాగమాన్యుండా ॥ తండ్రి ॥