Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు
ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు
ఓ మరియా తనయా
నీ సన్నిధి నా పెన్నిధి ||2||
1. పెనుతుఫానులో నావను
కాచిన దేవుడవు
నడి సంద్రములో అలలపై
నడిచిన దేవుడవు ||2||
ఏడు రొట్టెలను పురజనులకు
పంపిన దేవుడవు
రెండు చేపలతో ఆకలిని
తీర్చిన దేవుడవు
నా ప్రాణ నేస్తమా
నీ ధ్యానమే నా జీవనం ||ఓ||
2. తల్లి మాటను గౌరవించి
నడచిన దేవుడవు
విందులో నీటిని రసముగా
మార్చిన దేవుడవు
నీ కర స్పర్శతో చూపునే
ఇచ్చిన దేవుడవు
చేతితో తాకి కుష్ఠమచ్చలే
మాపిన దేవుడవు
ఓ దైవ తనయా నీ మార్గమే
నా గమ్యము ||ఓ||