Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసుని చూడాలని
ప. ఒక మాట పలుక ఒకసారి చూడ
యేసువా నీవు రావా,
నాలోకి రావా, నాచెంత నిండా,
నా వద్దకు నీవు రావా
ఎన్నిరోజులు వేయించియుందును
నిన్ను చేరుటకు
త్వరగా వేంచేయుమా నా ఆత్మ నాధుడా
1. గుండెలో నిండివున్నా ఆశలన్ని తీరేనా ||2||
త్రిత్వేక క దేవా నాలో
నీవు కొలువై కరుణించవా ||2||
ఎన్నిరోజులు వేయించుయుందును
నిన్ను చేరుటకు త్వరగా వేంచేయుమా
నా ఆత్మ నాధుడా
2. ఒంటరినై పోయాను, బాధలలోవున్నాను
నీ ఊరటనివ్వా నీదారిలో నడువా
నాతోడు నీవురావా
ఎన్నిరోజులు వేచియుందును
నిన్ను చేరుటకు
త్వరగా వేంచేయుమా నా ఆత్మ నాధుడా