Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఒకవరం నిను కోరగా నీదు సన్నిధి చేరి
మనిషివోలే ఒక మనిషి వోలే
బ్రతుకు వరమును కోరగా ||2||
1. మంచి ఉండు నాలో చెడు ఉండు
చందురునిలోనూ మచ్చలుండూ
కీర్తిఉండూ అపకీర్తి ఉండూ
హిమాలయమున పల్లముండూ
లోపములను మార్చు కొనుటకు
నిందలను ఓర్చు కొనుటకు
నీదు కృపచే నన్ను మలచి
బ్రతుకు వరమీయవా ||ఒక||
2. స్నేహముండు బాంధవ్యముండూ
హెచ్చుతగ్గుల బేధముండూ
త్యాగముండూ అనురాగ ముండూ
పూలమాటున ముళ్లు ఉండూ
కష్టసుఖముల కలసి నడువగా
కలిమి లేముల పంచుకొనగా
నీదు కృపచే నన్ను మలచి
బ్రతుకు వరమీయవా ||ఒక||