Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 2
ప. ఒక్క క్షణము నీ సన్నిధిలో
ఉండిన చాలును దేవా ||2||
నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా ||2||
స్తుతి మహిమ నీకే ఆరాధన
స్తుతి మహిమ నీకే ఆరాధన
1. మోడు బారిన బ్రతుకులకు
చిగురుతొడుగును నీ సన్నిధి ||2||
చీకటైన గుండెలలో వెలుగు
నింపును నీ సన్నిధి ||2||
వెలుగు నింపును నీ సన్నిధి||స్తుతి||
2. విరిగి నలిగిన మనస్సులకు
ఊరటనిచ్చును నీ సన్నిధి ||2||
అలసి సొలసిన బ్రతుకులలో
నెమ్మది నిచ్చును నీ సన్నిధి ||2||
నెమ్మది నిచ్చును నీ సన్నిధి ||స్తుతి||