Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము
నాలోని సమస్తమా దేవుని సన్నుతించుము
1. ప్రభువు చేసిన ఉపకారములను
దేనిని మరువకుము
ఆయన నీపాపదోషములన్నియు క్షమియించును
ఆయనయే నీ వ్యాధులన్నింటిని తొలగించును
2. ప్రభువు నిన్ను నీ సమాధి నుండి
లేవనెత్తును ప్రేమ నెనరులు
దీవెలన్నియు నీ కొసగెను
ఆయనయే నీజీవితమును
సుఖములతో నింపును
3. యావే నీతి బాధ్యతలన్నిటికి
న్యాయం చేకూర్చును
ఆయన మోషేకు తన
మార్గములను తెలియజేసెను
ఆయనయే ఇస్రాయేలీయులకు తన
క్రియలను కనపరచును