Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ ఫాతిమా జపమాలరాజ్ఞీ
పాపులన్ కాపాడరావమ్మా
1 వ చరణం..
దైవమాటలు దూరమాయె
దేవదూషణ లెక్కువాయె ||2||
ధరణిలో మమ్ము కావరావమ్మా... llఓll
2 వ చరణం..
నీదు మాటు మరచినాము`
నీదు సేవలు మానినాము ||2||
సమాధానము మాకు నిడుమమ్మా... llఓll
3 వ చరణం..
ఎన్ని చెప్పిన ఏమిచేతుము
ఎటుతోచదు మాయలోకం ||2||
కరుణజూపి కావరావమ్మా... llఓll
4 వ చరణం..
ఫాతిమాపురి ` గుహలోన
యాదవులకే దర్శనంబై ||2||
సమాధానము చాటనంపవా.... llఓll
5వ చరణం..
ఫాతిమాపురి యాదవులకే
సాటివారము మేము కామా ||2||
సూటిగా మమ్ము దీటు చేయమ్మా.... llఓll
6వ చరణం..
రష్యాలోని నీదు బిడ్డలు
రక్తమొలుకుచు నిన్ను దలచి ||2||
మరియ మరియ యని మొరలు పెట్టారే.... llఓll