Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ నిత్య సహాయమాత - నిష్కళంక చరిత
వందనమమ్మా వందనం - ముదమార హృదివందనం
1. అలమటించు ఆర్తులకు - అభయ హస్తం నీవమ్మ
ఆపదలోనున్న వారికి - ముక్తి ప్రదాయని నీవమ్మ
మమ్ము కాచే మా తల్లివి - ఇప్పుడును ఎల్లప్పుడును
నీ నామమే ధన్యము - నీ స్మరణయే భాగ్యము
2. మోక్షరాజ్యము చేరతరింపగ - జపమాలను మాకొసగితివి
అక్షయమగు నీ జీవన వర్షం - అనవరతం కురిపించితివి
మముబ్రోచే మా జననివి - ఇప్పుడును ఎల్లప్పుడును
నీ నామమే ధన్యము - నీ స్మరణయే భాగ్యము