Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: అవే మరియ
ప. ఓ కన్య మరియ ఓ ధన్య చరితా
దావీదు వంశ శుభపుత్రివి నీవు
యేసేపు గృహమున వరగృహిణివి నీవు
ప్రభుయేసు నాధునికి ప్రియజననివి నీవు
1. వరములు నొసగే వరమాతవు నీవు
ఇంపారు బంగారు ఆలయం నీవు ||2||
నజరేతు పురమున వెలసిన మాతవు ||2||
పరలోక పట్టపు మహారాణివి
నీవు మహారాణివి నీవు
2. మహిమపురానికి మార్గము నీవు
ప్రభుయేసుని చేర చుక్కానివి నీవు ||2||
నడిపించు తల్లి నీ శాంతి పధములో ||2||
దీవించుమమ్మా పావన జనని' పావన జనని ||ఓ||