Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఊహించలేని మేలులతో నింపినా
నా యేసయ్యా నీకు నా వందనం
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్
1 వ చరణం.. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును
ఇశ్రాయేలుదేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమ్మును
2 వ చరణం.. నా దీన స్ధితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువ నిచ్చినావు
నీ కృపతో నన్ను ఆవరించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు