Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
బలిపీఠము సమీపింతము
పూజా బలి సమర్పింతము
1 వ చరణం..
పిత దేవుని ప్రీతి మేర సుతడేసుని సిలువ బలిని.
ఆత్మ దేవ వరములొందగ ముదమున మన మర్పింపగll బలి ll
2 వ చరణం..
లోప పాప భూయిష్టము మనమున్న ఈ జగతి
పాపపంకిలమును బాప కలువరి బలి నూత్న పరచll బలి ll
3 వ చరణం..
మనో బలము లేని మనము అర్పించెడి ఈ బలిని
ముద మారగ చేకొనుమని త్రియేక దేవుని వేడుకొనగll బలి ll