Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బలియైతివా నా ప్రభువా -
పలుబాధలు భరియించి రుధిరంబును అర్చించి
1. దూషించితిరా స్వామి - ఏ దోషములేకున్నన్
ద్వేషంబుతో బాధించి - అపహాస్యము చేసితిరా-
వసుదైక మహాత్ముండా ||2||
2. కలుషాత్ముండగు యూదా విష ప్రేమను ప్రకటించి
పేరాశకు పాత్రుండై నిను యూదుల కర్పింప - క్షమించుచు కూరిమితో ||బలి||
3. అన్నా కైఫాలు చేరి అన్యాయపు తీర్పరులై
ఎన్నో నెపములు నీపై ఆరోపించినగాని ఎదురాడక సహియించి ||బలి||
4. నీ సిలువే ఈ జగతిన్ - శరణంబని ఎరిగించి
నీ శాంత స్వభావంబె - కల్యాణపు మార్గమని పామరులకు చూపించి ||బలి||