Type Here to Get Search Results !

దేవాది దేవుడే ( deva devude Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవాది దేవుడే – దీనుదాయెను

మానవకారుడౌ – బాలుడాయెను..దేవా.. 


పాపసంహరుకుడు – పరమాత్మ పుత్రుడు 

ప్రాపంచ జ్యోతి యీ – పసిపాపుడు

మహనీయుడు - దీన మందారుడు

ఆది అంత్యంబులు లేని – అఖలంకుడు..దేవా.. 


ఆనాటి భక్తులు – యన్నట్టి మాటలు

ఈనాడు ఫలియించె – యీపాపలో

భావంబులో – భక్తి భావాలతో 

ముక్తిప్రదమైన – పాదాలు ముద్దిడదమా ..దేవా.. 


అనాధ నాధుడు – అఖిలేశుడీశుడు

కరుణాలవాలుడు – కానీనుడు 

జేమోడ్పుతో – జేజేయనునుతులతో

జేసు నామోచ్చారణ – భక్తితో చేతుమా..దేవా.. 


పాపకూపంబులో – పడియున్న దీనులన్

పాలింపనేతెంచే – పరమేశుడు

మోదంబుతో – పాప బేధంబుతో 

ప్రభుపాదాల మనసార – పూజింతుమా ..దేవా.. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section