Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవ లోకమందలి పావన పితా
మీదు నామం బర్పింప బడుగావుతన్ ll2ll
భూమిపై మీ రాజ్యంబు వ్యాప్తిని గాంచి
రోజు రోజునకు పెంపు నొందు గావుతన్ ll2ll
మోక్షము నందు ఓలె ధాత్రి యందును
మీదు చిత్తంబు నెరవేరు గావుతన్ ll2ll
కృప దైనందిన భోజనంబును
నాడు నాటి- కొసంగి మమ్ము బ్రోవుడీ
మా యెడ ద్రోహంబులు గావించు వారిని
మే మోర్చు రీతిని మా ద్రోహాల్ మీరోర్వుడీ ll2ll
శోధన నుండి మమ్ము సంరక్షించండి
కీడుల నుండియు కాచి కాపాడుడి.ఆమెన్.