Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దివ్యానంద ప్రభో - జీవాధార ప్రభో దీనాజనాశ్రీ కారుణ్యా - సుగుణామృత వినయా... ఘన మోక్షా నిలయా ... llదివ్యాll
1 వ చరణం..
ధర నీవె కదా ఓ లోకేశ - స్థిర జీవము నీవె కదా ||2||
ఘన పావనాత్మ - మానావతార
ఓ అల్ఫా ఓమేఘా - అత్యంత ప్రభావా llదివ్యాll
2 వ చరణం..
దురితావనిలో ధర పాపములో -
కడు ఘోరపు శాపములో ||2||
పడియున్న మమ్ము - కడుసేదదీర్చి -
ఓదార్చిన శ్రీయేసా - అక్షయ లోకేశా llదివ్యాll
3 వ చరణం..
నీరక్షణయే నిఖిలావనిలో - సంపూర్తిగ స్థిరమాయె ||2||
నీ సిలువ చెంత - భూలోకమంత
నయమాయెను ఘోరవిషం - పాపపు శేష విషం llదివ్యాll