Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుడు ||స్తుతింప బడునుగాక||
దేవుని పరిశుద్ద నామము ||స్తుతింప బడునుగాక||
నిజ దేవుడును నిజ మనుష్యుడునైన జేసు క్రీస్తువు ||స్తుతింప బడునుగాక||
జేసువు యొక్క పవిత్ర నామము ||స్తుతింప బడునుగాక||
జేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము ||స్తుతింప బడునుగాక||
. అతని మిక్కిలి పవిత్ర రక్తము ||స్తుతింప బడునుగాక||
పిఠము యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు ||స్తుతింప బడునుగాక||
. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు||స్తుతింప బడునుగాక||
దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ ||స్తుతింప బడునుగాక||
ఆమె యొక్క పరిశుద్దమును నిష్కళంకమునైన ఉద్భవము ||స్తుతింప బడునుగాక||
ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము ||స్తుతింప బడునుగాక||
. కన్యకయును తల్లియునైన మరియమ్మగారి యొక్క నామము||స్తుతింప బడునుగాక||
ఆమె యొక్క మహా విరక్త భర్తయగు పునీత జోజప్ప ||స్తుతింప బడునుగాక||
తన దూతలయందును తన పునీతులయందును దేవుడు ||స్తుతింప బడునుగాక||