Type Here to Get Search Results !

దేవా నీ ఒక్కమాట ( deva ne oka mata Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 2 


ప, దేవా నీవొక్క మాట పలికిన చాలునయ్యా

నా జీవితమే నేడు మారునయ్యా 

కన్న వాడవు నీవే కొన్న వాడవు నీవే 

ఉన్నవాడవు నీవే రానున్న వాడవు నీవే ||దే|| 


1. శతాధిపతితో ఒక మాట పలికితివి

తన దాసునికి నీవు స్వస్థత ఇచ్చితివి 

జక్కయ్యతో నీవు ఒక్క మాట పలికితివి 

తన ఇంటికి ఆనాడు రక్షణ ఇచ్చితివి 

మాటలతో మహిమలు చేసిన దేవా

నా జీవిత శైలిని మార్చుము దేవా ||దే|| 


2. సమరయ స్త్రీతో ఒక మాట పలికితివి

జీవజలము నీవు వరముగా నిచ్చితివి 

లాజరు లెమ్మని ఒక మాట పలికితివి 

ప్రాణమునిచ్చి నీవు మరల నిలిపితివి 

మాటలతో మహిమలు చేసిన దేవా 

నా జీవిత శైలిని మార్చుము దేవా ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section