Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవాలయ గంటలు - మ్రోగెను మదిలోన
రండి ఆ దేవదేవుని - ఆరాధించెదము ||2||
దేవదేవుని యెదలో - కొలువగా అందరు రారండి
ఆ దేవ దేవుని కరుణను - పొందగ వేగమే రారండి ||2||
ఆ.. ఆఆ... ఆ... ఆఆ... ఆఆ.. ఆఆ... ఆఆ....
1 వ చరణం..
పూవులతో సుమమాలలతో - ప్రభుసన్నిధే చేరుదాం
గానముతో ప్రియగానముతో - స్తుతిగీతమే పాడుదాం ||2||
కరుణామయుని పరమ పవిత్రుని-పూజలో పాల్గ్గొందము ||2||
రండి ఆ దేవదేవుని - ఆరాధించెదము ||2|| llదేవాll
2 వ చరణం..
ప్రార్ధనతో సుప్రార్ధనతో - ప్రభు ప్రార్ధనే చేయుదాం
సన్నిధిలో ప్రభుసన్నిధిలో - మన మొరలనే వేడుదాం ||2||
ప్రేమామయుని శాంతిస్వరూపుని-జీవనబలిలో పాల్గ్గొందము ||2||
రండి ఆ దేవదేవుని - ఆరాధించెదము ||2|| llదేవాయll